హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలి

byసూర్య | Sun, Oct 20, 2024, 11:08 PM

రాష్ట్రంలో మతోన్మాద శక్తుల వల్ల ధ్వంసం అవుతున్న హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని కోరుతూ శనివారం మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయని ఫలితంగా హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలు, ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవాలయాలపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దేవాలయాలకు పటిష్టమైన రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు పోహార్ తుకారం, మర్రి భాస్కర్, వేములవాడ రాజశేఖర్, మర్రిగడ్డ శ్రీనివాస్, ముక్క నరేష్, గుండు మోహన్, అరిగెల సత్యనారాయణ, రాంగోపాల్, గుండు ప్రభాకర్, గట్టిడి విజయ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం Mon, Oct 21, 2024, 11:46 AM
నారాయణ కాలేజీలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం Mon, Oct 21, 2024, 11:41 AM
తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు Mon, Oct 21, 2024, 11:14 AM
ఏఐ అంటే రేవంత్ రెడ్డి ఎనుముల ఇంటెలిజెన్స్ : కేటీఆర్ Mon, Oct 21, 2024, 10:47 AM
తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Mon, Oct 21, 2024, 10:22 AM