బిఆర్ ఎస్ పార్టీ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికం

byసూర్య | Sun, Oct 20, 2024, 10:28 PM

 గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతు తెలపడానికి వచ్చిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐపీఎస్, సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , ఇతర బిఆర్ ఎస్ పార్టీ నాయకులను ప్రభుత్వం అరెస్టు చేశారు ఇది అప్రజాస్వామికం అని బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ,కేసీఆర్  తీసుకొచ్చిన 95 శాతం లోకల్ రిజర్వేషన్లు తుంగలో తొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహారం ఉంది అని ఆయన అన్నారు.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాకుండా.. వికీపీడియా ప్రామాణికం అంటుండటం బాధాకారం అని అన్నారు.గత నాలుగు రోజులుగా ఎండ, వానా అనక ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థుల విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం, బాధాకారం అన్నారు.ఆందోళన చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మంది రేపు ఉన్నతాధికారులు కాబోతున్నారు.
వాళ్లను గొడ్ల మాదిరిగా లాక్కెళ్లుతూ కొడుతుండటం బాధాకరం అని,ఏ కారణం చేత మేము మొండిగా ఉన్నామో అన్నది అభ్యర్థులను పిలిచి కనీసం వాళ్లకు వివరణ ఇవ్వకపోవటం శోచనీయం, దారుణం అని అన్నారు.ఏ రాహుల్ గాంధీ, ఏ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అశోక్ నగర్‌కు వెళ్లి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మాటలు చెప్పి గెలిచారు కానీ ఇప్పుడు వాళ్ల మాటలు కూడా ఆలకించని పరిస్థితి చూసి తెలంగాణ యువత క్షోభిస్తోంది అని తెలిపారు.ఉన్నతాధికారులు కావాల్సిన యువతతోనే ఇలా వ్యవహరిస్తున్నారంటే.. మిగతా యువతతో ఎలా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవాలి అని,రేవంత్ రెడ్డి  ఇప్పటికైనా స్పందించి వారితో మాట్లాడాలి అని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇంత మొండిగా, మూర్ఖంగా వ్యవహరించకుండా అభ్యర్థులతో చర్చలు జరపాలి. సాహేతుకమైన కారణాలు చెప్పాలి అని కోరారు.లేదంటే వాళ్లు డిమాండ్ చేస్తున్నట్లుగా ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేయాలి అని,వాళ్లు ఊరికే వాయిదా వేయమని కోరటం లేదని ఆయన అన్నారు.


Latest News
 

కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM
త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ : తలసాని శ్రీనివాస్ యాదవ్ Tue, Oct 22, 2024, 12:26 PM
10 రూపాయల నాణేలు చలామణిపై అవగాహన కార్యక్రమం Tue, Oct 22, 2024, 12:09 PM
గోడ దూకిన గ్రూప్-1 అభ్యర్థి అరెస్ట్.! Tue, Oct 22, 2024, 12:07 PM