తెలంగాణలో మరో కొత్త రైల్వేలైన్.. ఈ రూట్‌లోనే

byసూర్య | Tue, Oct 01, 2024, 10:44 PM

తెలంగాణలో మరో కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానుంది. దేశంలో కొత్త రైల్వేలైన్లతో పాటు ఉన్న రైల్వేల ఆధునికీకరణపై ఫోకస్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మరో కొత్త రైల్వే లైన్ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే.. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే మార్గం పనులు శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు మరో కొత్త రైల్వే లైన్ మంజూరు కావటంతో.. తెలంగాణ వాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ కొత్త రైల్వేలైన్.. తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్‌లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ నిర్మించబోతున్నట్టు సమాచారం. ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు సుమారు 200.60 కిలోమీటర్ల దూరం ఈ కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించనున్నారు. అయితే.. ఈ కొత్త మార్గాన్ని రూ.4,109 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


ఈ కొత్త రైల్వే మార్గం వల్ల.. తెలంగాణతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ విస్తృతం చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా.. ఏపీలోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారీగా లబ్ది చేకూరనుంది. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది.


అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు కూడా రైల్వే అనుసంధానం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా.. మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకు కూడా భారీ ప్రయోజనం కలగనుందని చెప్పుకొచ్చారు.


ఇదిలా ఉంటే.. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే మార్గం కోసం.. ఇప్పటికే మోదీ సర్కార్ రూ.137 కోట్లు విడుదల చేయగా.. 2025 మార్చినాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా.. కొత్తపల్లి నుంచి వేములవాడ మధ్య ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే.. ఈ ట్రాక్ కోసం అధికారులు భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ రైల్వేలైను ద్వారా.. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు మధ్య ప్రస్తుతం ఉన్న దూరం మరింత తగ్గనుంది. ఈ క్రమంలోనే సిరిసిల్ల, సిద్దిపేటకు కూడా రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది.



Latest News
 

కూల్చేసిన ఇంట్లో చిన్నారులు.. కన్నీళ్లు పెట్టించే వీడియో.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ Tue, Oct 01, 2024, 11:07 PM
తండ్రీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! వాట్ ఏ మూమెంట్ Tue, Oct 01, 2024, 10:56 PM
దసరాకు 6 వేల ప్రత్యేక బ‌స్సులు, హైదరాబాద్ శివారు నుం Tue, Oct 01, 2024, 10:55 PM
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. కుటుంబ సభ్యులందరూ సమ్మతిస్తేనే, లేదంటే అది ఆప్షనల్ Tue, Oct 01, 2024, 10:53 PM
తెలంగాణలో వైన్సులు, మాంసం దుకాణాలు బంద్.. పెత్తరమాస వేళ పెద్ద సమస్యే వచ్చిందిగా Tue, Oct 01, 2024, 10:46 PM