ప్రతి ఉద్యోగికి పదివి విరమణ తప్పనిసరి

byసూర్య | Tue, Oct 01, 2024, 02:28 PM

ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడు  జీవితంలో ఎంతో సంతృప్తిని కలుగజేస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.సోమవారం  కలెక్టరేట్ లోని సమావేశం  హాలులో ఉద్యోగ పదవీ విరమణ పొందిన జిల్లా ఆడిట్ అధికారి  వి. వీరభద్ర రావు కు జిల్లా కలెక్టర్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.పదవి విరమణ కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్ డి ఓ వాసు చంద్ర,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.
ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడు అధికారుల మన్ననలు పొందడమే కాకుండా వ్యక్తిగత సంతృప్తిని కలగజేస్తుందని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, స్వచ్ఛ ధనం, పచ్చ ధనం కార్యక్రమం గాని, మండల ప్రత్యేక అధికారిగా తన వంతు బాధ్యతలు పూర్తి స్థాయి లో నిర్వహించారని అభినందనలు తెలిపారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా సహ ఉద్యోగులతో పనిచేసి 34 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారని అన్నారు.అదేవిధంగా తన జీవితంలో కుటుంబంతో సుఖ సంతోషాలతో గడపాలని కలెక్టర్ సందర్బంగా కోరారు. అదనపు కలెక్టర్ లు, పలువురు జిల్లా అధికారులు,   పదవీ విరమణ పొందిన ఉద్యోగి తో తమకున్న ఉన్న అనుభూతిని పంచుకున్నారు. పదవీ విరమణ కార్యక్రమంలో జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి  మల్లేశం,  వివిధ శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు Tue, Oct 01, 2024, 04:26 PM
హైదరాబాద్ పోలీసుల నయా రూల్స్ Tue, Oct 01, 2024, 04:13 PM
జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు Tue, Oct 01, 2024, 04:12 PM
మాజీ ఎంపీపీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే Tue, Oct 01, 2024, 04:10 PM
దసరా సెలవులు ప్రైవేట్ టీచర్స్ కి కూడా అమలు చేయాలి Tue, Oct 01, 2024, 03:58 PM