గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024..

byసూర్య | Sun, Sep 29, 2024, 09:31 AM

నేడు హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024 కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 15 నిమిషాల అనంతరం 5k రన్ ను ప్రారంభించగా..మరో 15 నిమిషాల తరువాత 3k రన్ ను మంత్రి ప్రారంభించారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు సుధ రెడ్డి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్ నిర్వహిస్తున్నారు. 10k రన్ పూర్తయ్యాక స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. మారథాన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన వారికి మెడల్స్ ను అందించనున్నారు. రన్నర్స్ ఒక్కొక్కరుగా చేరుకుని గచ్చిబౌలి స్టేడియం నుండి విప్రో సెంటర్ వరకు రన్నింగ్ కొనసాగనుంది. ఒకే సారి 3km, 5km, 10km సంయుక్తంగా నిర్వాహకులు నిర్వహించనున్నారు. సుమారు 5 వెలకు పైగా రన్నర్స్ పాల్గొన్నారు. ఈ.. పింక్ కలర్ దుస్తులతో ముస్తాబైన వీరు అందరూ కలిసి గచ్చిబౌలి స్టేడియంలో పక్షి రూపంలో మానవహారంగా ఏర్పడనున్నారు. ఈ విధంగా పక్షిరూపంలో ఏర్పడి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేరేందుకు ప్రయత్నించనున్నారు. అయితే.. ఈ పింక్ మారథాన్‌లో పాల్గొనే ఔత్సాహికులకు ప్రత్యేక న్యూట్రిషన్ కిట్ల ను అందించనున్నారు. అంతేకాకుండా.. రేసుకు తర్వాత చేయాల్సిన వ్యాయామ చిట్కాలను తెలియజేయనున్నారు.

Latest News
 

జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్ Sun, Sep 29, 2024, 10:09 AM
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024.. Sun, Sep 29, 2024, 09:31 AM
సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు Sun, Sep 29, 2024, 09:28 AM
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి Sun, Sep 29, 2024, 09:28 AM
పొంగిపొర్లుతున్న పెద్ద చెరువు.. Sun, Sep 29, 2024, 09:22 AM