హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్ చేస్తున్న ఆకతాయిలు

byసూర్య | Fri, Sep 20, 2024, 11:59 AM

సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతున్నది. ఫేమస్ అయ్యేందుకు వెనకా ముందు ఆలోచించకుండా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా వీరి తీరు మాత్రం మారడం లేదు.అక్కడ ఇక్కడ రీల్స్ చేస్తే ఏమొస్తుందిలే అనుకున్నారో ఏమో కానీ కొంత మంది యువకులు రీల్స్ చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్నే ఎంచుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఈ ఆకతాయిల వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే లెక్క లేకుండా పోయింది, ముందు వీళ్లని బొక్కలో వేయండి సర్ అంటూ ఓ నెటిజన్స్ ఫైర్ కాగా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరో యూజర్ రియాక్ట్ అవుతూ సర్ ఈ విషయంలో చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించండి అంటూ సిటీ సీపీ సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేశాడు. మరి ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.


Latest News
 

విమలక్కను సన్మానించిన ఉప్పల వెంకటేష్ Fri, Sep 20, 2024, 02:14 PM
కథలాపూర్ తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ Fri, Sep 20, 2024, 02:02 PM
నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ Fri, Sep 20, 2024, 01:31 PM
ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం Fri, Sep 20, 2024, 01:29 PM
కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను మరణాల ఉచ్చుగా మార్చింది : కేటీఆర్ Fri, Sep 20, 2024, 12:34 PM