కాలనీలకు కొత్త రోడ్లు.. కూడళ్లలో ఫ్లైఓవర్లు.. నగరంలో ఇక ట్రాఫిక్ ఫ్రీ జర్నీ

byసూర్య | Sat, Sep 07, 2024, 08:06 PM

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే నగరంలో అనేక అంతర్జాయ సంస్థలు పెట్టుబడులు పెట్గగా.. మరికొన్ని సంస్థలు మందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరాన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. గత ప్రభుత్వం కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు నిర్మించగా.. వాటికి కొనసాగింపుగా రేవంత్ సర్కార్ కూడా కొత్తగా రహదారులు, రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది.


హైదరాబాద్ నగరంలో కాలనీల కష్టాలను తీర్చటంతో పాటుగా.. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ సమస్య తగ్గించేందుకు కసరత్తు మెుదలు పెట్టింది. అందులో భాగంగా హెచ్‌-సిటీ పేరుతో జీహెచ్‌ఎంసీ సరికొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట నిత్యం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు కాలనీల్లో పర్యటించగా.. మరో నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు పూర్తవుతాయని ఆమె వెల్లడించారు. ఈ ప్రాతిపదనలను రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా సీఎం రేవంత్‌ రెడ్డికి అందజేస్తామని ఆమ్రపాలి స్పష్టం చేశారు.


చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాలనీ రోడ్ల నిర్మాణం, కొత్తగా వేర్వేరు కూడళ్లలో ప్లైఓవర్ల ల నిర్మాణానికి ప్రతిపాదనలు తమ ప్రణాళికలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ వాసులు ప్రధానంగా ట్రాఫిక్‌ సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇరుకైన రోడ్లు, ఇతరత్రా సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపుతామని ఆమ్రపాలి వెళ్లడించారు. హైదరాబాద్ నగర భవిష్యత్తుకు హెచ్‌-సిటీ కీలక మలుపు కానుందని చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రతి నిత్యం జోన్లవారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రౌండ్ లెవల్‌కు వెళ్లి పరిశీలిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే చార్మినార్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ప్రణాళికలు కొలిక్కి వచ్చాయని చెప్పారు.


నగరంలోని ఆరాంఘర్‌ చౌరస్తా నుంచి నెహ్రూ జూ పార్కు వరకు, గచ్చిబౌలి కూడలి నుంచి కొత్తగూడ వైపు, ఇతరత్రా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం వేగవంతం చేస్తున్నామని కమిషనర్ ఆమ్రపాలి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి త్వరలో జీహెచ్‌ఎంసీకి భారీగా నిధులు అందనున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధి జరగనుందని ఆమ్రపాలి మీడియాతో వెల్లడించారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM