బల్కంపేట ఎలమ్మ కళ్యాణోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు.. వాటికి ఈసారి నో పర్మిషన్

byసూర్య | Tue, Jun 25, 2024, 08:00 PM

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక ముఖ్యమైన దేవాలయాల వారీగా సమావేశాలు కొనసాగుతుండగా.. జూలై 8,9,10 వ తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంపై హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


జూలై 8,9,10 తేదీల్లో జరిగే అమ్మవారి కళ్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు ఆదేశించారు. ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే ఈసారి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంతరి సూచించారు. గుడి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. భారికేడ్ల ఎత్తు తగ్గించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. గత బోనాల సమయంలో వీవీఐపీ పాసులు ఎక్కువగా ఇవ్వడం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈసారి ప్రతి గుడిలో వీవీఐపీ పాసులు తగ్గేలా దేవాదాయ శాఖ అధికారులు, సమన్వయం చేసుకోవాలని సూచించారు.


తమ ప్రభుత్వం శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని.. మహిళా భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గుడికి చుట్టుపక్కల ఉన్న రోడ్లలో ట్రాఫిక్ డైవర్షన్ చేసుకునేలా ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ ఉండడంతో పాటు ప్రత్యేక జనరేటర్లు, మొబైల్ ట్రాన్సఫార్మార్లు, ప్రత్యేక ఎలక్ట్రిక్ ఉద్యోగులు నిరంతరం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ టాయిలెట్స్‌తో పాటు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలన్నారు. 20 వాటర్ ట్యాంకర్లు అదనంగా నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. జూలై 8,9,10 వ తేదీల్లో బల్కంపేట ప్రాంతంలో నిరంతం నీరు అందేలా వాటర్ వర్క్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కళ్యాణం తరువాత రథోత్సవం సమయంలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి.


స్థానిక దేవాలయ కమిటీలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతి ఇవ్వొద్దని కోరగా.. బల్కంపేట ఉత్సవాలకు డీజే అనుమతి ఇవ్వడం లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కార్యదర్శి హన్మంతరావు, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ట్రాఫిస్ డీసీపీ రాహుల్ హెగ్డే, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్, సనత్ నగర్ కాంగ్రెస్ ఇంఛార్జి కోటా నీలిమ, స్థానిక కార్పొరేటర్, సరళ జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్ అండ్ బీ ఇతర ముఖ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM