తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

byసూర్య | Sun, Jun 23, 2024, 04:12 PM

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నైరుతి రుతపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంగా భారీగా ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.


 నేడు ఉమ్మడి నిజామాబాద్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షానికి అవకాశం ఉందన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. ఉదయం మేఘాలు కమ్మేసి సాయంత్రానికి వర్షం కురవొచ్చని చెప్పారు. మేఘాల కారణంగా తీవ్ర ఉక్కపోత ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో పగటివేళ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే బయటకు వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM