రేపు మోస్తరు .. ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు

byసూర్య | Fri, May 31, 2024, 10:05 PM

తెలంగాణకు మరోసారి వర్ష సూచన అందింది. రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. దీంతో శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. 


నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.


Latest News
 

కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM
త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ : తలసాని శ్రీనివాస్ యాదవ్ Tue, Oct 22, 2024, 12:26 PM
10 రూపాయల నాణేలు చలామణిపై అవగాహన కార్యక్రమం Tue, Oct 22, 2024, 12:09 PM
గోడ దూకిన గ్రూప్-1 అభ్యర్థి అరెస్ట్.! Tue, Oct 22, 2024, 12:07 PM