ఏపీ రాజకీయ పక్షాలు వెంటనే లేవనెత్తాలి: మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

byసూర్య | Fri, May 31, 2024, 09:01 PM

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-5 ప్రకారం హైదరాబాద్ నగరం ఏపీ, తెలంగాణలకు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీతో ఆ గడువు ముగిసిపోవడంపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు మించి కొనసాగించాలనే అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే లేవనెత్తాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై లక్ష్మీనారాయణ కొన్ని రోజుల కిందట కూడా స్పందించారు. ఏపీకి ఇంత వరకు రాజధాని ఏర్పడనందున, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగిస్తూ  భారత రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు.


Latest News
 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్య Tue, Oct 22, 2024, 11:43 AM
ప్రతీ ఒక్కరూ మంచి ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి Tue, Oct 22, 2024, 11:38 AM
మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం Tue, Oct 22, 2024, 10:55 AM
హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి Tue, Oct 22, 2024, 10:47 AM
నేడు హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం Tue, Oct 22, 2024, 10:26 AM