ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుంది.. కేటీఆర్‌కు రఘునందన్ ఉచిత సలహా

byసూర్య | Tue, May 07, 2024, 09:08 PM

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో అయోధ్య కేంద్రంగా ప్రధాన పార్టీలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. రాముడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల ఓ రోడ్‌షోలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాముడు, రామ మందిరమే అజెండాగా జనంలోకి బీజేపీ నేతలు వెళ్తున్నారని అన్నారు. రేషన్ బియ్యం ఇక్కడే కలిపి రాముడి అక్షింతల పేరుతో ఇంటింటికి పంచుతున్నారని అన్నారు.


ఈ కామెంట్లపై తాజాగా బీజేపీ నేత, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘునందన్.. రాముడు అందరివాడని రామ మందిర ప్రాణ ప్రతిష్టకు అన్ని మతాల వారు వచ్చారన్నారు. అక్షింతలు పంచిన రోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఒక వేళ తాము రేషన్ బియ్యాన్ని అక్షింతలుగా కన్వర్ట్ చేస్తుంటే అధికారంలో ఉన్న మీరు ఏం చేశారని ప్రశ్నించారు. పదేళ్లుగా అధికారంలో ఉండి.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి మండుటెండలో తిరుగుతుండటంతో ఎండదెబ్బ తగిలినట్లు కేసీఆర్, కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాముడి పట్ల ఏహ్య భావం ఉంటే వెంటనే తన పేరులోని రామ్ అనే పేరు తీసేయాలన్నారు. దేవుడి పేరు తీసేసి.. నాస్తికుడి పేరు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌లతో ప్రతిపక్ష నేతల ప్రైవేట్ కన్వర్జేషన్ విన్న మీకు అక్షింతలు ఎక్కడ కలిపారో పట్టుకోవడం తెలియలేదా? అని కేటీఆర్‌పై రఘునందన్ ఫైర్ అయ్యారు.


Latest News
 

మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలి Sun, May 19, 2024, 06:16 PM
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు Sun, May 19, 2024, 06:11 PM
ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM
రేపు నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటన Sun, May 19, 2024, 06:04 PM
త్వరలోనే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: మంత్రి Sun, May 19, 2024, 06:01 PM