సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకుంటా: ఎంపీ అభ్యర్థి నీలం మధు

byసూర్య | Mon, May 06, 2024, 01:27 PM

గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్, విల్లాస్ లో నెలకొన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు తనవంతుగా బాధ్యత తీసుకుంటానని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం రాత్రి సమావేశం పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని విజన్ ఉర్జిత్ విల్లా కమ్యూనిటీ, త్రిపుర గేలక్సీ అపార్ట్ మెంట్స్, నైబర్ ఉడ్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులతో ఎంపీ అభ్యర్థి నీలం మధు సమావేశం అయ్యారు. పటాన్ చెరు ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఎలక్షన్ కోఆర్డినేటర్ అశోక్ గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా ఆయా కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను ఎంపీ అభ్యర్థి నీలం మధు దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడారు. ముఖ్యంగా తాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇంకుడు గుంతలు.


సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.అలాగే తెల్లాపూర్ కు ఎంఎంటిఎస్ రైలు సేవలు పొడగింపు, అలాగే కాలనీల నుంచి రైల్వే స్టేషన్ కు కనెక్టివిటీకి సరైన రోడ్లు వేసేందుకు దోహద పడతానని చెప్పారు. అలాగే ప్రత్యేకంగా పాస్ పార్ట్ సేవా కేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. తెల్లాపూర్ పరిధిలో ఉన్న చెరువుల అభివృద్ధికి సైతం కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నిధులతో పాటు రాష్ట్ర ఇక్కడికి ప్రభుత్వ నిధులను తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను ఆశీర్వదించి, ఈ పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM