ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కే.టీ రామారావు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మెుగులయ్యకు సాయం

byసూర్య | Sun, May 05, 2024, 08:33 PM

పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద కళాకారుడు దర్శనం మెుగిలయ్య అలియాస్ కిన్నెర మెుగలయ్య దీనస్థితిపై ఇటీవల సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కుటుంబాన్ని పోషించటం కోసం హైదరాబాద్ శివారు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ నిర్మాణ స్థలంలో ఆయన కూలీగా మారాడు. గత ప్రభుత్వం ఇచ్చిన రూ. కోటి రూపాయల గ్రాంట్ పిల్లల పెళ్లిల్లు ఇతర ఖర్చులకు అయిపోయాయని.. తుర్కయంజాల్‌లో చేపట్టిన ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగోపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 600 గజాల ఇంటి స్థలం ఇంకా మంజూరు కాలేదని.. కలెక్టరేట్ ఆఫీసులు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారులు మారుతున్నారనే తప్ప తన సమస్య తీరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ నేపథ్యంలో మెుగలయ్యపై వరుస కథనాలు సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో గత రెండ్రోజుల క్రితం సర్క్యూలేట్ కాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మెుగులయ్యను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాజాగా కేటీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మెుగులయ్యకు ఆర్థికసాయం అందజేశారు. ఎమ్మెల్యేలు వివేకానంద్, చామకూర మల్లా రెడ్డి, మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి మెుగులయ్యకు సాయం అందజేశారు. ఈ సందర్భంగా మెుగులయ్య తన బాధను కేటీఆర్‌కు చెప్పుకొన్నారు.


గత ప్రభుత్వంలో కేసీఆరే తనను గుర్తించారని.. తనకు ఇంటి జాగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. అయినా ఇప్పటి వరకు తనగు జాగా మంజూరు కాలేదని వాపోయారు. కలెక్టర్లు మారినా.. తనకు ఇచ్చిన హామీ నెరవేరలేదని చెప్పారు. తాను చిన్నప్పటి నుంచి మట్టినే నమ్ముకొని బ్రతికానని.. కాకతీయ కాలువకు కూడా కూలీగా పని చేశానని గుర్తు చేశారు. కేసీఆర్ గుర్తించటం వల్లే తనకు ఇంతటి గుర్తింపు వచ్చిందని చెప్పారు. మెుగులయ్య విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్‌తో మాట్లాడి ఇంటి జాగా మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా, మెుగలయ్యకు ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 10 వేల పెన్షన్ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలు అవాస్తమని తెలంగాణ సాంస్కృతిక శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఆయనకు ప్రతినెలా పెన్షన్ ఇస్తున్నట్లు ఆ శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ స్పష్టం చేసిన సంగితి తెలిసిందే.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM