ఫోటో కోసం ట్రై చేస్తే ప్రాణమే పోయింది.. ఎంత విషాదం

byసూర్య | Sun, May 05, 2024, 08:18 PM

సోషల్ మీడియాలో లైకుల కోసం కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. సరదాకు చేసే కొన్ని పనులు చివరకు ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. లైకు, షేర్ల కోసం తాపత్రయపడి ప్రాణాలు కోల్పోయినవారు అనేకం. తాజాగా హైదరాబాద్ శివారు కీసరలోనూ అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఈత కొడుతూ ఫోటో దిగుదామనుకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురిలోని జెకె కాలనీకి చెందిన మోదుగ గౌతమ్‌ రాజ్‌ (22) అనే యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. వీకెండ్ కావటంతో శనివారం తన స్నేహితులు అనురుధ్‌, అఖిల్‌తో కలిసి కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్‌ క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌తో ఫొటోలు దిగుతుండగా.. గౌతమ్‌రాజ్‌ ఒక్కసారిగా నీటిలో మునిగి పోయాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, సోషల్ మీడియా మోజు.. ఫోటోల పిచ్చితో ఇలాంటి పనులు చేయటం సరైంది కాదని పోలీసులు చెబుతున్నారు. ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండే ప్రాంతాల్లో ఫోటోలు తీసుకోవటం మంచిది కాదని అంటున్నారు. మీ పిచ్చితనం వల్ల కుటుంబసభ్యులకు తీరని వేధన మిగులుతుందని హెచ్చరిస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM