తులం బంగారమేమో గానీ.. కళ్యాణ లక్ష్మి చెక్ కూడా బౌన్స్ అయ్యింది: లబ్దిదారుని వీడియో వైరల్

byసూర్య | Sat, May 04, 2024, 07:05 PM

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. గత ప్రభుత్వం అమలు చేసిన చాలా పథకాలు అమలు కావట్లేదని.. అన్నింటినీ ఆపేశారంటూ బీఆర్ఎస్ నేతలు కీలక ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. అలాంటిదేమీ లేదని, అసలైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే.. రైతుబంధు విషయం తీవ్రస్థాయిలో ఆరోపణలు రాగా.. చాలా మంది అన్నదాతల ఖాతాల్లో డబ్బులు వేశామని మిగిలిన వారికి కూడా సాయం అందిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది.


ఈ క్రమంలోనే.. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం కింద.. వధువు కుటుంబానికి లక్షా పదహార్లు అందించేవారు. అయితే.. ఈ కళ్యాణ లక్ష్మి పథకం కింద.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోయారంటూ ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్న నేపత్యంలో.. ఓ లబ్దిదారుని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


తులం బంగారం ఏమో కానీ.. లక్ష రూపాయల పేరు మీద ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయ్యిందంటూ ఓ లబ్దిదారుడు ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. జనగామ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ చెందిన మోతే ప్రశాంత్.. తన చెల్లెకు గత సంవత్సరం పెళ్లి చేసినట్టు చెప్పుకొచ్చాడు. కాగా.. అదే సంవత్సరం కళ్యాణ లక్ష్మి కి అప్లై చేసుకున్నామని.. అందుకుగానూ జనవరిలో చెక్ కూడా ఇచ్చారని తెలిపాడు. అయితే.. ఆ చెక్కును సరైన సమయంలోనే (మూడు నెలల్లోపే) బ్యాంకులో డిపాజిట్ చేయగా.. బౌన్స్ అయినట్లు బ్యాంక్ ఉద్యోగుల చెప్పారని ప్రశాంత్ వివరించారు. తులం బంగారం అని చెప్పారు కానీ.. అసలు ఇచ్చిన చెక్కే రిజెక్ట్ అయ్యిందంటూ ప్రశాంత్ వాపోయాడు.


కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ నేతలు తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగానే చెక్కు డబ్బులు లేక బౌన్స్ అయ్యిందా.. వేరే ఇతర కారణాల వల్ల రిజెక్ట్ అయ్యిందా అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా.. Sat, May 18, 2024, 05:01 PM
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం Sat, May 18, 2024, 04:57 PM
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఆర్డీవో Sat, May 18, 2024, 04:54 PM
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి Sat, May 18, 2024, 04:52 PM
29న ఘంటసాల కాంస్య విగ్రహం ఆవిష్కరణ Sat, May 18, 2024, 04:46 PM