లైట్ బీర్లను అందుబాటులో ఉంచండి.. తెలంగాణ ఆదాయం మరింత పెంచుతాం: యువకుడి లేఖ

byసూర్య | Mon, Apr 29, 2024, 08:54 PM

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఎండ వేడిమి తట్టుకోలేక చాలా మంది కూల్‌డ్రింక్స్, జ్యూసులు వంటివి తాగుతున్నారు. ఇక మందు బాబులయితే.. వైన్‌ షాపులు, బార్లకు క్యూ కడుతున్నారు. మంచినీళ్ల ప్రాయంగా బీర్లు తాగేస్తున్నారు. అయితే రాష్ట్రంలో లైట్ బీర్ల కొరత ఏర్పడింది. డిమాండ్ పెరగడంతో బీర్లు దొరకటం లేదు. చాలా వైన్ షాపుల్లో బీర్ల కొరతతో నో స్టాక్ బోర్డులు దర్శనిమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువకుడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావటం లేదంటూ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరిండెంట్‌కు లేఖరాశాడు. తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, మంచిర్యాల పేరుతో వినతిపత్రం రాసి అధికారులకు అంజేశాడు.


'నా పేరు కొట్రంగి తరుణ్, నేను తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిని. గత 18 రోజుల్లో రాష్ట్రానికి 670 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉంది. కానీ కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు ఏ వైన్ షాప్‌ల్లోగానీ ,బార్లలో గానీ లభ్యం కావటం లేదు. ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్నకొద్దీ యువకులు దాహం తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని మా దృష్టికి రావటం జరిగింది. ఈ జిల్లాలోనే కాదు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లోనూ కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదు.


ఈ లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువ సమయం ఉంటుంది. ఆ తర్వాత మా పనులను మేము చేసుకోగలుగుతాం. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటివి వస్తున్నాయి. మాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి మాకు కావాల్సిన చల్లటి కింగ్ ఫిషర్ లైట్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాపుల్లో అందుబాటులో ఉండే విధంగా చేయగలరని బీర్లు తాగే ప్రతి ఒక్కరి తరపున మిమ్మల్ని కోరుతున్నాం. మాకు సహకరించినట్లయితే మన రాష్ట్ర ఆదాయాన్ని మరింత రెట్టింపు చేయుటకై మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.


కొన్ని వైన్ షాపులు సిండికేట్ అయి కింగ్ ఫిషర్ లైట్ బీర్లలో మార్జిన్ అనేది తక్కువ వస్తుందని వాటిని తెప్పించడం లేదని సమాచారం. అందుకని మాకు కొత్త కొత్త రకం బీర్లను అలవాటు చేస్తున్నారు. గతిలేక మేము వాటిని తాగటం జరుగుతుంది. దాని ద్వారా మా ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉంది, రాష్ట్ర ఆదాయం కోసం మా ఆరోగ్యాలు సైతం లెక్కచేయని మాపై దయ ఉంచండి. ఇట్టి విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మేము కోరిన విధంగా జిల్లాలో స్టాక్ ఉండేలాగా సహకరించగలరు.ఎ' అని లేఖ రాశాడు. ఈ విజ్ఞాపన పత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనోడి కమిట్మెంట్, డెడికేషన్ గొప్పదని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM