శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే‌పై చిరుత కలకలం.. పరుగులు పెడుతోన్న సిబ్బంది

byసూర్య | Sun, Apr 28, 2024, 08:02 PM

శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున రన్‌వేపై చిరుతను ఎయిర్‌పోర్ట్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. చిరుత ఇంకా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోనే సంచరిస్తున్నట్టు సమాచారం. దీంతో అటవీశాఖ అధికారులకు విమానాశ్రయం సిబ్బంది సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న వైల్డ్‌లైఫ్ విభాగం సిబ్బంది, జూ అధికారులు.. ఆ పరిసరాల్లో చిరుత కోసం గాలిస్తున్నారు. ఇక, చిరుత సంచారం వార్త తెలిసి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.


అయితే, దాదాపు మూడేళ్ల కిందట ఎయిర్ పోర్టు గోడ దూకి చిరుత వెళ్లిన ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డయింది. దానిని పట్టుకోడానికి బోన్లు ఏర్పాటు చేసి, గాలించారు. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది.


అయితే, 2019 నవంబరు 27న విమానాశ్రయ పరిసరాల్లో చిరుత తిరుగుతోందన్న సమాచారంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఫారెస్ట్, జూ అధికారులను అక్కడకు రప్పించారు. రెండుగంటల పాటు ముమ్మరంగా గాలించగా.. అది చిరుత కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరికది చిరుత పులి కాదు అడవి పిల్లి అని తేల్చారు. ప్రస్తుతం కూడా చిరుతపులి వ్యవహారం తీవ్ర అలజడి రేపుతోంది. అది అసలు చిరుతేనా? లేక గతంలో మాదిరి అడవి పిల్లా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


Latest News
 

వనపర్తి-పెబ్బేరు బీటీ రోడ్డు విస్తరణ చేపట్టాలి Mon, May 13, 2024, 02:26 PM
మహబూబ్ నగర్ 10. 33.. నాగర్ కర్నూల్ 9. 18 పోలింగ్ Mon, May 13, 2024, 02:22 PM
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే Mon, May 13, 2024, 02:20 PM
ప్రశాంతంగా నడుస్తున్న ఓటింగ్ Mon, May 13, 2024, 02:12 PM
ఓటు వేసిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు Mon, May 13, 2024, 02:08 PM