70 ఏళ్ల క్రితం గంధర్వ వివాహం.. ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్ల చేతుల మీదుగా గ్రాండ్‌గా పెళ్లి

byసూర్య | Sun, Apr 28, 2024, 07:31 PM

"మంచి దాంపత్యానికి మంగళసూత్రం ఎందుకనున్నారు. ఈ జగమే తమ ప్రేమకు సాక్ష్యమనుకుని ఒక్కటయ్యారు. నలుగురిలో గొప్పగా బతికారు.. నలుగురు కుమారులకు జన్మనిచ్చారు. ఆదర్శ దాంపత్యానికి మూడు ముళ్లు ముఖ్యం కాదని.. మనసు ముడి ప్రధానం అని నిరూపించారు." ఈ 80 ఏళ్ల వృద్ధ జంట. సుమారు 70 ఏళ్లు సహజీవనం చేసిన ఈ వృద్ధ జంట.. ఇప్పుడు పెళ్లి పీటలెక్కారు. అది కూడా వారి నలుగురు కుమారులు, ఓ కుమార్తెకు కలిగిన సంతానమైన మనవళ్లు, మనవరాళ్ల సంతోషం కోసం. ఈ ఆసక్తికర వేడుకకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండా వేదికైంది.


సమిడా నాయక్, గుగులోతు లాలమ్మ అనే ఓల్ట్ కపుల్స్.. 70 సంవత్సరాల క్రితమే గంధర్వ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అయితే.. 80 ఏళ్ల వయసు ఉన్న ఈ వృద్ధ జంట.. ఇన్నేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉండటం చూసి మురిసిపోయుతున్న మనవళ్లు, మనవరాల్లు.. వారికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.


అయితే.. అందుకు వారి మనుమడు యాకూబ్ పుట్టినరోజునే ముహార్తంగా మార్చుకుని.. కుటుంబం అంతా కలిసి ఆ వృద్ధ జంటకు ఘనంగా పెళ్లి చేశారు. ఇద్దరినీ పట్టు బట్టలు, నగలతో ముస్తాబు చేసి.. బుగ్గన చుక్కలు పెట్టి.. బామ్మకు తాతతో మాంగళ్యధారణ చేపించారు. అయితే.. ఈ పెళ్లి కోసం వాళ్లు ప్రింట్ చేపించిన ప్లెక్సీ ఇంట్రెస్టింగ్‌గా మారింది. అందులో ఈ అరుదైన సన్నివేశానికి "సహస్త్ర చంద్రదర్శన వేడుక"గా నామకరణం చేశారు. "ఈ వేడుక మా అందరికి సంతోష కలయిక" అంటూ కొడుకులు, కోడళ్లు, మనువలు, మనువరాళ్లు వాళ్ల పెళ్లికి పెద్దలయ్యారు.


ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న పాశ్చాత్య సంస్కృతి, మారుతున్న యువత ఆలోచనలు, సినిమాల ప్రభావం.. వెరసి పెళ్లి అనే సంప్రదాయంపై యువతలో అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇప్పటికే ప్రేమలు, లివింగ్ టుగెదర్ సంస్కృతి మనవరకు పాకేసింది. సిటీల్లో ఉంటూ.. పెద్ద పెద్ద చదువులు చదువుతున్న కొంతమంది యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఒకరినొకరు ఇష్టపడి.. సహజీవనం చేయటం సాధారణంగా మారిపోయింది. ఇద్దరూ కొన్ని రోజులు లివింగ్‌లో ఉండి.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని సెట్ అయితే.. పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. సెట్ కాకపోతే మ్యూచ్‌వల్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోతున్నారు.


మరికొంత మంది అయితే.. లివింగ్‌లో ఉంటూనే తమ ప్రేమకు చిహ్నంగా పిల్లల్ని కూడా కనేసి.. కుటుంబాన్ని క్రియేట్ చేస్తున్నారు. అయితే.. ఈ ప్రాసెస్‌లో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోవటమనే ఒక్క ఎపిసోడ్‌ను అవైడ్ చేస్తున్నారు. దీని గురించి అడిగితే.. ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలంటే.. శాస్త్రోక్తంగానే పెళ్లి కచ్చితంగా చేసుకోవాలా.. లేకపోతే కలిసి ఉండలేరా.. మరి అలా పెళ్లి చేసుకున్నవాళ్లు విడిపోకుండా అలాగే ఉంటున్నారా.. అన్న ప్రశ్నల వర్షమే కురిపిస్తుంటారు.


అయితే.. ఇదేదో ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ కాదండోయ్.. ఎప్పుడో మన తాతల ముత్తాల కాలం నుంచే ఈ సంస్కృతి ఉంది. దాన్నే అపట్లో గందర్వ వివాహం అనే వాళ్లు. ఇప్పుడు ప్రేమ వివాహమని అంటున్నారు. అయితే.. గంధర్వ వివాహాల్లో తాళి కట్టటాలు, శాస్త్రోక్తంగా ఒక్కటవ్వటాలు.. కుటుంబసభ్యుల అంగీకారాలు ఇవేవీ ఉండవన్న మాట. ఇద్దరికీ ఒకరంటే ఒక్కరికి నచ్చితే చాలని నిర్వచిస్తున్నారు. అచ్చంగా ఇప్పుడు లివింగ్ టుగెదర్ ప్రాసెస్ అన్నట్టు...!


Latest News
 

25 రోజుల్లో 10 వేల కేసులు నమోదు.. 320 కోట్ల సొత్తు స్వాధీనం Sun, May 12, 2024, 07:34 PM
తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఈ 10 రోజులు నో టెన్షన్ Sun, May 12, 2024, 07:31 PM
ఓటర్ల వేలికి పడే 'సిరా చుక్క' తయారయ్యేది హైదరాబాద్‌లోనే.. 37 ఏళ్లుగా తయారీ, 100 దేశాలకు ఎగుమతి..! Sun, May 12, 2024, 07:27 PM
తెలంగాణ ఎన్నికలు.. ఇప్పటి వరకు సీజ్ చేసిన సొత్తు విలువ ఎన్ని కోట్లో తెలుసా Sun, May 12, 2024, 07:23 PM
ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. డిక్కీలో కనిపించిన 2 బ్యాగులు.. ఏంటని తెరిచి చూస్తే మైండ్ బ్లాక్..! Sun, May 12, 2024, 06:16 PM