పెళ్లి తర్వాత మళ్లీ బరిలో దిగిన బర్రెలక్క.. ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పోటీగా

byసూర్య | Tue, Apr 23, 2024, 07:27 PM

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ముందు చెప్పినట్టుగానే లోక్ సభ ఎన్నికల బరిలో కూడా నిలుస్తోంది. ఈ మేరకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. ఎలాంటి హడావుడి లేకుండా.. కేవలం తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క.. నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.


అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన బర్రెలక్క.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతతో పాటు మాజీ జేడీ లక్ష్మీనారాయణ, వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ లాంటి ప్రముఖులు కూడా మద్దతు తెలిపారంటే.. బర్రెలక్క చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అయితే.. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్లిన బర్రెలక్కకు.. కేవలం 5,598 ఓట్లు మాత్రమే పోలవటంతో.. నాలుగో స్థానానికి పరిమితమైంది.


అయితే.. అసెంబ్లీలో ఓడిపోయినా సరే నిరుద్యోగుల తరపున తన పోరాటం ఆపనంటూ బర్రెలక్క ముందే ప్రకటించింది. తాను ఏ పార్టీలో చేరనని.. లోక్ సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రకటించింది. అప్పుడు చెప్పినట్టుగానే.. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. కాగా.. నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. గతంలో బర్రెలక్కకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేశారు.. బీఎస్పీలోకి కూడా ఆహ్వానించినట్టు సమాచారం. అలాంటిది.. ఇప్పుడు అదే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ మీదే ప్రత్యర్థిగా బర్రెలక్క పోటీకి దిగుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇటీవలే తన స్నేహితుడు, సమీప బంధువు వెంకటేశ్‌తో బర్రెలక్క ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.


Latest News
 

యాదగిరిగుట్టపై అపచారం.. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇదేం పని 'మాస్టారూ'..! Fri, May 03, 2024, 09:49 PM
పద్మశ్రీ మొగులయ్యకు కళాకారుల పింఛన్ ఆగిపోయిందా..? ఇదిగో ప్రూఫ్ Fri, May 03, 2024, 09:38 PM
పైకి ఎంబీబీఎస్ డాక్టర్‌నని కలరింగ్.. లోపల మాత్రం చేసేది Fri, May 03, 2024, 09:34 PM
నేటి నుంచే ఓటింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల్లో కాదు ఇంటి నుంచే Fri, May 03, 2024, 07:46 PM
నన్ను నేరుగా కోర్టులో హాజరుపర్చండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పిటిషన్ Fri, May 03, 2024, 07:43 PM