బట్టతలపై వెంట్రుకలు రప్పించేందుకు ట్రీట్మెంట్.. రిజల్ట్‌ చూసి పేషెంట్ల మైండ్ బ్లాక్

byసూర్య | Sat, Apr 20, 2024, 07:30 PM

తినే ఆహారపు అలవాట్ల వల్లో.. పని ఒత్తిడి వల్లో.. లైఫ్‌ జర్నీలో పడుతున్న టెన్షన్ల వల్లో.. ప్రస్తుత సమాజంలో వెంట్రుకలు రాలటం  బట్టతల సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పది మందిలో కనీసం ఆరు నుంచి ఐడుగురు ఈ సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. కాగా.. దీని ట్రీట్మెంట్‌ కోసం కుప్పలు తెప్పలుగా క్లినిక్‌లు వెలియగా.. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ ట్రీట్మెంట్ కోర్సులు ఇస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని పలువురు నకిలీ డాక్టర్లు కూడా పుట్టుకొస్తున్నారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ నకిలీ స్కిన్ అండ్ హెయిర్ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇంతకు ఈ నకిలీ డాక్టర్ ఎలా దొరికిపోయాడన్నది ఆసక్తికరంగా మారింది. యూపీ నుంచి హైదరాబాద్ వచ్చిన అస్లాం అనే వ్యక్తి.. నగరంలో రెండు చోట్ల క్లినిక్‌లు ఏర్పాటు చేశాడు. అందులో ఒకటి గచ్చిబౌలిలో పెట్టాడు. చర్మ రోగాల నివారణతో పాటు బట్టతలపై వెంట్రుకలు రప్పిస్తానంటూ.. ప్రచారం చేశాడు. దీంతో.. పలువురు బాధితులు అస్లాంను కలవగా.. వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలు పెట్టాడు అస్లాం. అయితే.. బట్టతల ఉన్న వారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తానంటూ నమ్మించి.. పలువురికి ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టాడు.


కాగా.. అస్లాం దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్లకు.. సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో వాళ్లకు అనుమానం వచ్చింది. అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయటమే కాకుండా.. తాను చేసిన వైద్యానికి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటుండటంతో.. బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. విచారణ చేసిన పోలీసులు.. అస్లాం నకిలీ డాక్టర్‌గా గుర్తించారు. వెంటనే.. అస్లాంను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM