రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ.. కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు

byసూర్య | Thu, Apr 18, 2024, 07:48 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నరావు (Kalvakuntla Tejeshwar Rao)పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే హైదరాబాద్ శివారు ఆదిభట్ల భూవిదాం కేసులో కేసు నమోదు కాగా.. తాజాగా దోపిడీ కేసు ఫైల్ అయింది. ఆయనతో పాటు మరో ఐదుగురిపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి దాడి చేశారని అందులో పేర్కొన్నాడు.


ఓ సమస్య పరిష్కారం కోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విజయవర్ధన్ రావు తనకు న్యాయం చేయాలని కోరుతూ కన్నారావు వద్దకు వెళ్లారు. కన్నారావుకు పరిచయస్తురాలైన బిందు మాధవి అలియాస్ నందిని ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వద్ద నగలు, నగదు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిపింది. నందినతో పాటు మరికొంత మందితో కలిసి ఆయన విజయవర్ధన్‌ రావును తన గెస్ట్‌ హౌస్‌లో అక్రమంగా నిర్బంధించాడు. అనంతరం అతడిని బెదిరించి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడు.


తనకు తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నతాధికారులు తెలుసునంటూ ఓ ఇద్దరి పేర్లు వెల్లడించారు. వారి పేర్లు చెబుతూ కన్నారావు తనను బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM