బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్

byసూర్య | Sat, Dec 09, 2023, 11:13 AM

బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నిక‌య్యారు. HYDలోని తెలంగాణ భ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ.. తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలంతా బస్సులో అసెంబ్లీకి బయల్దేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ 39 స్థానాలను గెలుచుకొని ప్రతిపక్ష హోదాలో నిలిచింది.
తెలంగాణ‌లో మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు చేశారు. అయితే కీల‌క‌మైన హోం శాఖ‌ను మాత్రం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇంకా ఎవ‌రికి కేటాయించలేదు. హోం శాఖతో పాటు విద్య‌, ప‌శుసంవ‌ర్థ‌క‌, కార్మిక, మున్సిప‌ల్, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌, సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌ల‌ను కూడా ఇంకా హోల్డ్‌లో పెట్టారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత మిగ‌తా వారికి ఈ శాఖ‌ల‌ను కేటాయిస్తార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. కాగా, అధిక ప్రాముఖ్య‌త క‌లిగిన హోం శాఖ‌ను సీఎం రేవంత్ త‌న వ‌ద్ద‌నే ఉంచుకోనున్న‌ట్లు తెలుస్తోంది.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM