'నాకు గన్‌మెన్‌లు అవసరం లేదు'.. తిప్పి పంపిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి

byసూర్య | Wed, Dec 06, 2023, 07:25 PM

హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బండారి లక్ష్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు గన్‌మెన్‌లు అవసరం లేదని వారిని తిప్పి పంపారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధి 10 కిలోమీటర్ల మేర ఉంటుందని.. దానికి గన్‌మెన్‌లు ఎందుకని అన్నారు. గన్‌మెన్‌లు ఉంటే ప్రజల్ని కలవడానికి ఇబ్బంది కరంగా ఉంటుందని చెప్పారు. ఎన్నికల ముందు కూడా 2+2 గన్మెన్లను పంపితే.. తాను తిప్పి పంపినట్లు చెప్పారు. అవినీతి అక్రమాలకు పాల్పడే వారికి, ఇల్లీగల్ పనులు చేసేవారికి గన్‌మెన్లు అవసరం కానీ.. నిత్యం ప్రజల్లో ఉండే తన లాంటి వారికి గన్‌మెన్లు అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని అందుకే గన్‌మెన్లను తిప్పి పంపినట్లు వెల్లడించారు. నిత్యం ప్రజల్లో ఉండే వారికి గన్‌మెన్‌లు.. రక్షణ అవసరం లేదని.. ప్రజలే రక్షిస్తారని లక్ష్ణారెడ్డి వ్యాఖ్యనించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డిపై 49,030 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లక్ష్మారెడ్డికి 1,32,927 ఓట్లు రాగా.. పరమేశ్వర్ రెడ్డికి 83,897 ఓట్లు పోలయ్యయి. ఇక మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ ప్రభాకర్ బీజేపీ నుంచి పోటీ చేయగా.. ఆయన 47,332 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని కాదని ఈసారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించగా.. ఆయన విజయం సాధించారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM