తన హిందూ స్నేహితులతో కలిసి,,, హైదరాబాద్‌లో వినాయకుడి మండపం ఏర్పాటు చేసిన ముస్లిం

byసూర్య | Sun, Sep 24, 2023, 07:06 PM

మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో లెక్కలేనన్ని మతాలున్నాయి. అన్ని మతాల వారు ఉన్నప్పటికీ మన దేశంలో ఉన్న సామరస్యం ఇంక ఎక్కడా కనిపించదు. హిందూ ముస్లిం భాయి.. భాయ్ అంటూ సోదరభావాన్ని పంచుకుంటాం. దానికి ప్రతీకగానే అనేక సంఘటనలను మనం చూస్తూ ఉంటాం. తాజాగా.. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. ఓ ముస్లిం యువకుడు గణేష్ మండపం ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నాడు. తన హిందూ మిత్రులతో కలిసి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఏ మతం అయినా.. తామంతా అన్నదమ్ముళ్లాగా కలిసి ఉంటామని మతాలకు అతీతంతా అన్ని పండగలు కలిసి జరుపుకుంటామని చాటి చెబుతున్నాడు.


హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన మహమ్మద్ సిద్ధిక్ తన హిందూ స్నేహితులతో కలిసి కాలనీలో గణేష్ మండపం ఏర్పాటు చేశాడు. మండపాన్ని సర్వాంగసుందరంగా రంగురంగుల దీపాలు, పూలదండలతో అలంకరించి గణనాధుడిని ప్రతిష్టించాడు. అనంతరం ప్రతిరోజు తన స్నేహితులతో కలిసి పూజలు చేస్తున్నాడు. ఈ పూజల్లో స్థానికంగా ఉండే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా పాల్గొంటున్నారు. గత 18 సంవత్సరాలుగా రాంనగర్‌లో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సిద్ధిక్ తెలిపారు. ముస్లిం, సిక్కు క్రైస్తవ వర్గాలకు చెందిన ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. వినాయక చవితి పండుగను చాలా వైభవంగా, ఆనందంగా జరుపుకుంటామని అన్నారు. తన హిందూ స్నేహితులు రంజాన్ పర్వదినాల్లో తనతో పాటు వేడుకల్లో పాల్గొంటారని వెల్లడించారు. చాలా ఏళ్లుగా తాము కలిసే ఉన్నామని.. ఇక్కడి కాలనీలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేస్తారని తెలిపారు.


చిన్నప్పటి నుంచి తాము స్నేహితులమి.. మతం మాకు ముఖ్యం కాదని అందుకే అన్ని వేడుకల్లో కలిసి పాల్గొంటామని సిద్ధిక్ స్నేహితుడు సాయి వెల్లడించారు. గత 18 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామమని తెలిపారు. నిమజ్జనం కూడా చాలా గ్రాండ్‌గా చేస్తామని.. ప్రతిరోజు పూజతో పాటు ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మతం గురించి ఎలాంటి ఆలోచన లేకుండా తామంతా ఒకరితో ఒకరు సోదరభావంతో జీవిస్తున్నామని సాయి తెలిపారు. ఇలా ముస్లిం, హిందువులు ఏర్పాటు చేసిన గణేష్ మండపం గురించి తెలుసుకున్న పలువురు ఇది కదా మతసామరస్యమేంటే అని కొనియాడుతున్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM