మంత్రాలు చేస్తున్నాడని నింద.. భరించలేక 75 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య

byసూర్య | Sun, Sep 24, 2023, 06:05 PM

టెక్నాలజీ ఎంతగానో పెరిగిపోతోంది.. చంద్రున్ని కూడా చేరుకోగలుగుతున్నాం.. కానీ మనలో ఉన్న మూఢనమ్మకాలను మాత్రం వీడలేకపోతున్నాం. అలాంటి మూఢనమ్మకాల కారణంగా జీవితం చివరి అంఖంలో ఉన్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవాల్సివచ్చిన దుస్థితి ఏర్పడింది. మంత్రాలు చేస్తున్నాడని తనపై మోపిన నిందను భరించలేక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో జరిగింది. ఎడ్ల బాలరాజు అనే 75 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి గ్రామంలో నివసిస్తున్నాడు. ఇద్దరు వృద్ధ దంపతులు.. పండుటాకుల్లా తమ జీవనాన్ని కొనాసాగిస్తున్నారు. కాగా.. గ్రామంలోని కొందరు వేసిన నింద.. జీవితంలోని చివరి అంఖంలో ఉన్న ఆ వృద్ధున్ని కఠిన నిర్ణయం తీసుకునేలా చేసి.. ఆ పుణ్య దంపతులను విడిపోయేలా చేసిది.


అయితే.. ఆ వృద్ధుడు.. రెండు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఎర్ర నవీన్ ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేశాడని.. దాని వల్ల నవీన్ భార్య పావని అనారోగ్యానికి గురైందని స్థానికులు ఆరోపించారు. అంతేకాదు.. అదే గ్రామంలోని నవీన్, రాము, రాజు, నర్సయ్య అనే నలుగురు వ్యక్తులు కలిసి అందరి ముందే.. బాలరాజును చితకబాదారు. ఈ అవమానంతో బాలరాజు తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. తనపై పడిన నిందను భరించలేక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గ్రామ శివారుకు వెళ్లి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


అటుగా వెళ్లిన స్థానికులు విగతజీవిగా పడి ఉన్న బాలరాజును గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని.. కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం.. బాలరాజు మృతికి కారకులైన నలుగురు వ్యక్తులపై ఆయన భార్య బాలరాజవ్వ.. రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM