ఇకపై పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు

byసూర్య | Sat, Jun 10, 2023, 10:33 AM

నారాయణపేట సబ్ పోస్ట్ ఆఫీస్ లో ప్రజల సౌకర్యార్థం ఆధార్ నమోద్ మరియు నవీకరణ కోసం ప్రత్యేక సదుపాయం కల్పించినట్లు నారాయణపేట సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ నారాయణపేట తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శనివారం స్పెషల్ ఆధార్ క్యాంపును పోస్ట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కావున ఈ సేవలను అందరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు పొందడానికి ఈ క్రింది విధంగా రుసుములు తెలియజేశారు. 5 సంవత్సరాలలోపు పిల్లల ఆధార్ నమోదు ఉచితం, తప్పనిసరి బయోమెట్రిక్ నమోదు 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల మరియు 15 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వారికి ఉచితం, ఇతర బయోమెట్రిక్ నవీకరణ 100 రూపాయలు చిరునామా మార్పు (చిరునామా ఫోన్ నెంబర్ లింకు) 50 రూపాయలు, డాక్యుమెంట్ నవీకరణ 50 రూపాయలు, ఆధార్ కార్డు ప్రింట్ 30 రూపాయలు అని తెలిపారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM