హైదరాబాద్‌లో భారీ వర్షం..ఆదివారంనాడు అంతగా కురిసింది

byసూర్య | Mon, Jun 05, 2023, 07:46 PM

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటివరకు భనుడు తన ప్రతాపాన్ని చూపగా.. ఆ తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వటంతో మబ్బులు కమ్మేసి వాతావరణమంతా చల్లబడిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌, చింతల్‌, నార్సింగి, కొంపల్లి, మియాపూర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌, పటాన్‌చెరు, నిజాంపేట, లింగంపల్లి, మాదాపూర్‌, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, సుచిత్ర, కొంపల్లి, గాజులరామారం, సురారం, కోకాపేట్‌, అల్వాల్‌, శేరిలింగంపల్లి, నేరెడ్‌మెట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.


ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఆదివారం భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌, పటాన్‌చెరు, రామచంద్రపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. వికారాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు, వరగంల్, జగిత్యాల, నిజామాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. మరికొన్ని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM