పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బంపర్ఆ ఫర్ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్

byసూర్య | Mon, Jun 05, 2023, 07:47 PM

తెలంగాణలో రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఎటూ తేలటం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేశాక... ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆయనకు గాలం వేసినా..పార్టీలో చేరే విషయంపై ఆయన స్పష్టతనివ్వలేదు. బీజేపీ తరపున ఈటల రాజేందర్ బృందం, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ టీం ఇటీవల ఆయనతో చర్చలు జరిపారు. అయినా.. ఆయన ఏ పార్టీ వైపు మెుగ్గు చూపలేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఆధారంగా పొంగులేటి నిర్ణయం తీసుకుంటారని ఆయన్న సన్నిహితులు వెల్లడించారు. అయితే కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆయన మాత్రం ఏ పార్టీలో చేరే విషయంపై మౌనం వీడటం లేదు.


పైగా పార్టీలో చేరే విషయంపై ఇటీవల ఆయన కీలక కామెంట్స్ చేశారు. తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీనే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. తాను ఏ పార్టీలో చేరుతా అనే విషయంపై మరో 15 రోజుల్లో చెబుతానంటూ మూడ్రోజుల క్రితం కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో పొంగులేటికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ఇచ్చారు. తన పార్టీలో చేరితో ఖమ్మంలో ఎవరికి కావాలంటే వారికే అసెంబ్లీ సీట్లు ఇవ్వటంతో పాటు.. అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. పొంగులేటితో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడిన జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్, కొండవిశ్వేశ్వర్ రెడ్డిలను సైతం ఆయన తన పార్టీలోకి ఆహ్వానించారు. మీరంతా కలిసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఒక్కసీటు కూడా గెలవలేరని అన్నారు. ఇప్పటికే చాలా పార్టీలు మారారని.. ప్రజాశాంతి పార్టీలోనూ చేరాలని పాల్ కోరారు.


తాను అన్నగా ఉండగా ఉంటానని నేతలకు కేఏ పాల్ భరోసానిచ్చారు. ప్రజాశాంతి పార్టీలోకి వస్తే కావాల్సిన పొజిషన్ ఇస్తానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఆరు నెలల కాలం మాత్రమే ఉంటానని.. నవంబర్ నుంచి ఏఫ్రిల్ వరకు ముఖ్యమంత్రిగా ఉండి వివిధ దేశాల నుంచి ప్రెసిండెంట్లను, మిలయనీర్లను పిలిపించి ఖమ్మం జిల్లాలో 10 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడాతానని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం పెన్షన్లు, రైతుబంధు, నిరుద్యోగ భృతిని డబుల్ చేద్దామని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే.. ఖమ్మంలో బడుగుబలహీన వర్గాలు, ముస్లీం,మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఓట్లు వెయ్యరని పాల్ వ్యాఖ్యనించారు.


పొంగులేటి కోరుకున్న 10 స్థానాలు ఆయనకు కావాల్సిన అభ్యర్థులకే ఇస్తానని పాల్ అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే పొంగులేటిని ఉపముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు. అందుకు ప్రజాశాంతి పార్టీలో చేరాలని పాల్ పొంగులేటిని కోరారు. మరి పాల్ ఆహ్వానం మేరకు పొంగులేటి ప్రజాశాంతి పార్టీలో చేరుతారా ? లేక మరో పార్టీలోకి వెళ్తారా? అది కాకుండా సొంత పార్టీ పెడతారా ? అనేది వేచి చూడాలి.


Latest News
 

నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM
ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి Sat, Apr 20, 2024, 01:04 PM