బాన్సువాడ ప్రభుత్వాసుపత్రి ఫైర్ యాక్సిడెంట్,,,కాలిబూడిదైన ఆపరేషన్ థియేటర్

byసూర్య | Thu, Jun 01, 2023, 04:51 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు అప్రమత్తమయ్యారు. సమయస్పూర్తితో వ్యవహరించి రోగులను పై అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు తరలించారు. మంటల ధాటికి ఆసుపత్రి మెుత్తం తట్టమైన పొగ వ్యాపించింది. పొగ కారణంగా రోగులు, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది ఉక్కిరిబిక్కిరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.


ఈ అగ్ని ప్రమాదంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ స్పందించారు. ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆసుపత్రి క్లీనింగ్ సిబ్బంది గదులను శుభ్రం చేస్తుండగా ఆపరేషన్‌ థియేటర్‌లోని ఏసీ నుంచి మంటలు రావటాన్ని గుర్తించారన్నారు. వెంటనే తాము వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించామని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిందని వెల్లడించారు.


పై అంతస్తుల్లో ఉన్న రోగులను తక్షణమే కిందికి తరలించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ఆపరేషన్ థియేటర్ మాత్రం కాలి బూడిదైందని.. అందులోని వైద్య పరికరాలు పూర్తిగా కాలిపోయినట్లు చెప్పారు.



Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM