పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి... బండి సంజయ్

byసూర్య | Mon, Mar 20, 2023, 06:07 PM

తెలంగాణలో వడగండ్లతో కూడిన అకాల వర్షాలతో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహాన్ని అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతే వారిని ఆదుకోవడానికి రాష్ట్రంలో ఇప్పటి వరకు సమగ్ర పంట బీమా పథకాన్ని రూపొందించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల అన్నదాతలు నష్టపోతున్నారని చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి ఉంటే పంట నష్టపోయిన రైతులకు మేలు జరిగేదని అన్నారు. నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా రైతులకు వెంటనే పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు అందిస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం... ఆ హామీని అమలు చేయాలని అన్నారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM