నేడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ర్యాలీ,,,హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

byసూర్య | Sun, Feb 05, 2023, 02:06 PM

నిత్యం హైదరాబాద్ వాసులకు  ట్రాఫిక్ సమస్యలు మాత్రం తప్పడంలేదు.  తాజాగా నగర వాసులకు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్డు నుంచి హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వరకు ఇవాళ ఎలక్ట్రిక్‌ వాహనాల ర్యాలీ జరగనుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పలు సూచనలు జారీ చేశారు.


ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ర్యాలీ పీపుల్స్ ప్లాజా, ఐమాక్స్ నెక్లెస్ రోడ్ రోటరీ, వివి విగ్రహం, కెసిపి జంక్షన్, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సిఎల్, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం.45, కేబుల్ బ్రిడ్జ్ మీదుగా సైబరాబాద్ పరిధిలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. నల్లగుట్ట జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను ఐమాక్స్ నెక్లెస్ రోటరీ వైపు అనుమతించమని, రాణిగంజ్, బుద్దభవన్ వైపు మళ్లించడం జరుగుతందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.


ఇక రోటరీ వద్దకు ర్యాలీ చేరుకునేవరకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్, బీఆర్‌కే భవన్ నెక్లెస్ రోటరీ వైపు వాహనాలను అనుమతించరు. ఇటువైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. అలాగే ర్యాలీ వీవీ విగ్రహం దాటే వరకు షాదన్, రాజ్‌భవన్ రోడ్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలను కాసేపు ఆపేయనున్నారు. తాజ్‌క‌ృష్ణ నుంచి కేసీపీ వైపు వచ్చే వాహనాలను మెర్క్యూర్ హోటల్ వద్ద నిలిపివేస్తారు. మోనప్ప ఐస్‌లాండ్, సాగర్ సొసైటీ, క్యాన్సర్ హాస్పిటల్, ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను కొద్దిసేపు ఆపేయనున్నారు. ఇక ర్యాలీ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.


సైబర్ టవర్ నుంచి అపర్ణ టవర్స్, మీనాక్షి టవర్స్, కొండాపూర్, మియాపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఖానామెట్ జంక్షన్ మీదుగా హైటెక్స్ జంక్షన్, సీఐఐ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ వైపు మళ్లిస్తారు. కొత్తగూడ నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సీఐఐ జంక్షన్, టెక్ మహీంద్ర, డెల్, హెచ్‌ఎస్బీసీ లెమన్ ట్రీ జంక్షన్, ఐకియా, మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు మళ్లిస్తారు. ఐకియా మధ్య బయో డైవర్సిటీ వైపు అన్ని బై-లేన్‌లు మూసివేయనుండగా.. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను ఖాజాగూడ జంక్షన్ మీదుగా విస్పర్ వ్యాలీ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.



Latest News
 

రేవంత్ రెడ్డిని దానితో పోలుస్తూ ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. నెటిజన్ల డౌటనుమానం Sat, May 18, 2024, 07:35 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. సంస్థ కీలక ప్రకటన Sat, May 18, 2024, 07:32 PM
రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు,,,తెలంగాణ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ సీన్ Sat, May 18, 2024, 07:29 PM
భారీ వర్షానికి తడిసిన ధాన్యం Sat, May 18, 2024, 05:25 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో రమేష్ రాథోడ్ Sat, May 18, 2024, 05:23 PM