సింగరేణి బోగ్గు ఉత్పత్తిలో ఆర్జీ1 అగ్రగామి: జిఎం

byసూర్య | Thu, Dec 01, 2022, 02:16 PM

రామగుండం రీజీయన్1 బోగ్గు ఉత్పత్తిలో సింగరేణిలోనే అగ్రగామిగా నిలిచిందని జిఎం కల్వల నారాయణ పేర్కోన్నారు. గురువారం జిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నవంబర్ నెలకు సంబంధించిన ఏరియా ఉత్పత్తి, ఉత్పాతకత, రక్షణ, బోగ్గు సరాఫరా, కార్మికుల సంక్షేమం, వైద్య, ఆరోగ్య వివరాలు వెల్లడించారు. నవంబర్ నెలలో బోగ్గు ఉత్పత్తిలో 125శాతంతో ముందుండగా, సింగరేణి మొత్తంలో 114శాతంతో అగ్రగామిగా నిలిచిందిందని, సహకరించిన ఉద్యోగులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే ఒరవడి కోనసాగించాలని ఉద్యోగులను కోరారు. కార్మిక సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైజిఎం పర్సనల్ లక్ష్మినారాయణ, సంబంధిత అధికారులు పాల్గోన్నారు.


Latest News
 

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం Fri, May 03, 2024, 12:02 PM
బిజేపీలో చేరిన మాజీ సర్పంచ్ Fri, May 03, 2024, 12:01 PM
రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి Fri, May 03, 2024, 11:29 AM
తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం Fri, May 03, 2024, 10:56 AM
హామీలు మరిచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి Fri, May 03, 2024, 10:42 AM