నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సిఎం: ఎమ్మెల్యే

byసూర్య | Tue, Nov 29, 2022, 01:19 PM

రామగుండం నియోజకవర్గంలోని నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా చూడటమే నా తపనంతా అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కోరుకంటి విజయమ్మ 4వ వర్దంతి సందర్భంగా మంగళవారం టిటిఎస్ అంత్గరాంలో కానిస్టేబుల్, ఎస్ఐ ఈవెంట్స్ శిక్షణ తీసుకుంటున్న యువతి యువకులకు విజయమ్మ పౌండేషన్ ద్వారా ట్రాక్ షూట్స్, షూస్ ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఎర్పాడిన తర్వాత 2లక్షల ఉద్యోగాలకు 8ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల జీవితాల్లో సిఎం కేసీఆర్‌ వెలుగులు నింపుతున్నారని అన్నారు. పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఇంకా ఏమైనా వసతులు కావాలంటే తాను అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల ఎంపీపీ దుర్గం విజయ, జడ్ఫీటీసీ అముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, సర్పంచులు ధరణీ రాజేష్, కుర్ర వెంకటమ్మ నూకరాజు, బండారి ప్రవీణ్, తుంగ పిండి సతీష్, మెరుగు పోషం, బాదరవేని స్వామి, గుమ్ముల రవీందర్, ధర్మాజీ కృష్ణ, అంతర్గాం మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గోన్నారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM