లోన్ యాప్స్ గురించి తెలుసుకొని లోన్ తీసుకోండి...పోలీసుల సూచన

byసూర్య | Wed, Sep 28, 2022, 07:56 PM

ఏదీ సరైన లోన్ యాప్ ఏదీ న్యాయబద్దంకానిదో తెలుసుకొని మరీ  లోన్ యాప్ ద్వారా రుణం తీసుకోవాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు. లోన్ యాప్స్.. ఈ మాట వింటేనే చాలా మందిలో గుబులు మొదలవుతోంది. ఏదో అసవరం పడి కొంత డబ్బును అప్పుగా తీసుకుంటే.. దానికి ఫలితంగా ప్రాణాలనే వడ్డీ కింద కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. తీసుకుంది గోరంత అయితే.. కొండంత వసూలు చేస్తూ.. లోన్ యాప్స్ నిర్వాహకులు చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఈ లోన్ యాప్స్ ప్రతినిధుల వేధింపులు తట్టుకోలేక.. తెలంగాణలో ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. ఒకానొక సమయంలో.. రాష్ట్రాన్ని కుదిపేసిన లోన్ యాప్స్ వ్యవహారం.. పోలీసుల కఠిన చర్యల కారణంగా కాస్త సద్దుమణిగింది. అయినా.. చేప కింద నీరులా మళ్లీ వ్యాపిస్తూ.. నిండు ప్రాణాలకు బలి కోరుతూనే ఉంది. ఇటీవల ఈ లోన్ యాప్స్ వేధింపులు భరించలేక హైదరాబాద్‌లో ఓ ఎంసెట్ ర్యాంకర్ ఆత్మహత్య చేసుకోవటం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. దాంతో.. పోలీసులు మరోసారి వీటిపై ఫోకస్ పెట్టారు.


అవసరానికి లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకోవటం వరకు సరే కానీ.. అందులో ఏదీ జన్యూన్ యాప్.. ఏది ఫేక్ యాప్.. అనేది తెలియకపోవటం వల్లే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఫేక్ లోన్ యాప్స్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. వాటి జాబితాను పోలీసులు విడుదల చేశారు. అందులో ఉన్న యాప్స్ నుంచి లోన్లు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఆ లిస్టులో ఉన్న వాటి నుంచి లోన్ తీసుకుంటే.. తిప్పలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. 


Latest News
 

మూడో వార్డులో బిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM
విస్తృత ప్రచారం నిర్వహించిన పిరమిడ్ అభ్యర్థి మోహన్ రెడ్డి Fri, May 03, 2024, 02:08 PM
అత్తమామ వేధిస్తున్నారని.. మహిళ సూసైడ్ Fri, May 03, 2024, 02:07 PM
కాంగ్రెస్ నేతల ప్రచార జోరు Fri, May 03, 2024, 02:05 PM
గడపగడపకు ప్రచారం నిర్వహించిన బోర్లం బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 02:04 PM