ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్

byసూర్య | Wed, Aug 17, 2022, 03:51 PM

తెలంగాణ ఆర్టీసీ మరో కొత్త తరహాలో ప్రజలను అక్కటుకోవడానికి బంపర్ ప్రకటన చేసింది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్సకోసం వచ్చిన వారు తిరిగి ఇంటికి వెళ్లడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది ఆ సంస్థ. వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చూపించుకోవడానికి వెళ్లి.. తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆసుపత్రిలో డాక్టర్లు రాసిన మందుల చిట్టీపై సమయాన్ని సూచిస్తారు. ఆ చిట్టీని కండక్టర్‌కు చూపిస్తే బస్సులో ఫ్రీగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎక్కడివరకైనా ఉచితంగా ట్రావెల్ చేయవచ్చని, దూరప్రాంతాల నుంచి హైదరాబాద్ కు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఎంజీబీఎస్‌తో పాటు నగరంలో ఎక్కడ దిగినా తర్వాత 2 గంటలు సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మరి ప్రయాణికులు ఎలా ఉపయోగించుకోనున్నారో వేచిచూడాల్సిందే!


Latest News
 

ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM