నేను మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ కు హోంగార్డునే : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

byసూర్య | Sat, Aug 13, 2022, 09:24 PM

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బద్రర్స్ ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త‌న‌పై చేసిన హోంగార్డు వ్యాఖ్య‌ల‌ను కాస్తంత సీరియ‌స్‌గానే తీసుకున్నారు. అవును తాను కాంగ్రెస్ పార్టీకి హోం గార్డునేనంటూ ఆయ‌న తేల్చి చెప్పేశారు. ఈ మేర‌కు త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ కు... '3 ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డును' అన్న కొత్త వాక్యాన్ని కోమ‌టిరెడ్డి చేర్చారు. 


నిన్న‌టిదాకా కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి ట్విట్టర్ హ్యాండిల్‌లో పార్ల‌మెంటు స‌భ్యుడు, మాజీ కేబినెట్ మినిస్ట‌ర్‌, నాలుగు సార్లు ఎమ్మెల్యే అన్న వాక్యాలే ఉండేవి. తాజాగా ఈ వాక్యాల త‌ర్వాత '3 ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డుగా ప‌నిచేస్తున్నాను' అంటూ ఆయ‌న ఓ వాక్యాన్ని చేర్చారు. రేవంత్ రెడ్డి త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా కోమ‌టిరెడ్డి త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను అప్‌డేట్ చేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM