సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి

byసూర్య | Thu, May 19, 2022, 03:35 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 23 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా రూ. 19, 08, 500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి గురువారం తన నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందిం చడం సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసానిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Latest News
 

రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి Fri, May 03, 2024, 11:29 AM
తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం Fri, May 03, 2024, 10:56 AM
హామీలు మరిచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి Fri, May 03, 2024, 10:42 AM
కార్నర్ సమావేశాన్ని జయప్రదం చేయాలి: మాజీ ఎమ్మెల్యే Fri, May 03, 2024, 10:38 AM
మోడీ ప్రధాని అవడం ఖాయం : బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి Fri, May 03, 2024, 10:33 AM