రిస్క్ లేకుండా అధిక వడ్డీతో రాబడినిచ్చే స్కీమ్

byసూర్య | Mon, Jan 17, 2022, 11:36 AM

సీనియర్ సిటిజన్స్ కోసం అనేక రకాల పథకాలు ఉన్నాయి. వాటిలో తక్కువ రిస్క్ తో అధిక రాబడిని అందించే ఓ స్కీమ్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న అనేక రకాల పథకాల్లో పోస్టాఫీస్ అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్‌) లో రాబడి ఎక్కువగా ఉందని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ పథకం ద్వారా మంచి రాబడి అందుకోవచ్చు. ఇందులో చేరడానికి 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. అయితే కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు వయో సడలింపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్‌లో లేదా కొన్ని బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. ఈ ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షల వరకు, కనీస మొత్తం రూ.1000 వరకు డిపాజిట్ చేసి ఆ మొత్తంపై వడ్డీ ప్రయోజనాలు అందుకోవచ్చు. ప్రస్తుతం ఎస్‌సీఎస్‌ఎస్‌ వడ్డీరేటు 7.4శాతం ఉండగా కేంద్రం త్రైమాసిక ప్రాతిపదికన ఇతర పథకాలతోపాటు ఈస్కీమ్‌ వడ్డీ రేటును సవరిస్తుందనే విషయాల్ని గుర్తించుకోవాలి. ఈ స్కీమ్ లో ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందచవ్చు. ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఐదు సంవత్సరాల కాలవ్యవధికి వడ్డీ లభిస్తుంది. డిపాజిటర్ ఖాతా మెచ్యూరిటీ అయిన ఒక సంవత్సరంలోపు, మూడు సంవత్సరాలకు ఒకసారి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM