పోస్టాఫీసులో సూపర్ స్కీమ్..

byసూర్య | Tue, Jan 11, 2022, 01:01 PM

మీ వద్ద ఉన్న డబ్బును ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీ రాబడి పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల్లో అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అందులో తక్కువ పెట్టుబడితో మంచి రాబడిని అందించే స్కీమ్ గురించి ఇవాళ తెలుసుకుందాం. పోస్టల్‌ శాఖలో ప్రవేశపెట్టిన మంత్లీ స్కీమ్‌ లో ఇన్ వెస్ట్ చేయడం ద్వారా ప్రతి నెల మీ చేతికి డబ్బు అందుతుంది. ఇందులో నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున డబ్బులు అందుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ లో చేరాలనుకునే వారు ఓకే సారి మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలపరిమితి 5 సంవత్సరాలు.ముందుగా మీ డబ్బును డిపాజిట్ చేసి ఐదేళ్ల వరకు ఆగాల్సి ఉంటుంది. అయితే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ప్రతి నెలా వడ్డీ వస్తూనే ఉంటుంది. ఈ స్కీమ్‌లో రూ.1000 నుంచి డబ్బులు పెట్టే అవకాశం ఉంటుంది. గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. అదే జాయింట్‌ అకౌంట్‌ తీసుకున్నట్లయితే రూ.9 లక్షల వరకు డబ్బులను ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. మీరు పెట్టిన మొత్తానికి డబ్బులు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కు 6.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఓ సారి వడ్డీ రేట్లపై సమీక్ష ఉంటుంది. ఆ సమయంలో వడ్డీ రేట్ తగ్గవచ్చు లేదా పెరగనూ వచ్చు. లేదా స్థిరంగా కూడా ఉంటుంది. ఒక వేళ భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీమ్‌లో చేరితే రూ.9 లక్షలు ఒకేసారి డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. వీరిద్దరికి కలిపి ప్రతి సంవత్సరం రూ.60 వేల వరకు లభిస్తాయి. అంటే నెలకు రూ.5 వేలు వస్తాయి.


Latest News
 

కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో అన్న ప్రసాద వితరణ Wed, May 15, 2024, 01:43 PM
భారీ మెజారిటీపై ‘మజ్లిస్‌’ ధీమా Wed, May 15, 2024, 01:41 PM
ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి Wed, May 15, 2024, 12:23 PM
అరుదైన వ్యాధితో కన్నుమూసిన తెల్లపులి Wed, May 15, 2024, 12:18 PM
మల్కాజిగిరిలో బిజెపి గెలుస్తుంది: సుధా పటేల్ Wed, May 15, 2024, 12:14 PM