ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు భారీ షాక్

byసూర్య | Mon, Nov 22, 2021, 11:05 AM

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు షాకిచ్చింది. ప్రీపెయిడ్‌ ఛార్జీల(టారిఫ్‌)ను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రిపెయిడ్ టారిఫ్ ధరలను 20-25 శాతం పెంచేసింది. డేటా టాపప్ ప్లాన్స్ ధరలను 20-21 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. తాజా పెంపుతో 28 రోజుల వాలిడిటీతో ఉన్న మినిమమ్‌ టారిఫ్‌ ప్రస్తుతం రూ.79 ఉండగా, అది రూ.99 కానుంది. ఇక డాటా టాప్‌ అప్స్‌లో రూ.48 అన్‌లిమిటెడ్‌ 3జీబీ డాటా ప్యాక్‌ను రూ.58 లకు పెంచేసింది. ఏఆర్‌పీయూ ఆదాయం పెరగడం వల్ల నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రం కొనుగోళ్లలో గణనీయ పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే భారత్‌లో 5జీ అమలుకు కూడా ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కనీసం రూ.200గా ఉండేలా, గరిష్టంగా రూ.300 వరకు ఉండేలా ఎయిర్‌టెల్ చూసుకుంటుంది. అప్పుడే లాభసాటి వ్యాపారం సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM