మీరు ఆ పండ్లు తింటారా..?

byసూర్య | Tue, Oct 26, 2021, 01:58 PM

శీతాకాలంలో వచ్చే మృదుఫలం, మధురఫలమైన సీతాఫలాన్ని ఇష్టపడనివారు చాలా తక్కువమందే ఉంటారు. అయితే ఇవి తింటే నిద్రొస్తుందని, జలుబు చేస్తుందని చాలామంది పొరబడుతుంటారు. కానీ అన్ని ఫలాల వలె ఇందులోనూ బోలెడన్ని పోషకాలుంటాయి. విటమిన్ B6 సమృద్ధిగా లభించే ఈ ఫలంలో పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ముప్పు ఉండదు. కాగా మలబద్దకాన్ని తగ్గించే ఇందులోని కాపర్, పీచుపదార్థాలు జీర్ణశక్తిని పెంచేందుకు, రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచేందుకు సాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు ప్రచారంలో ఉన్న భయాలు, అపోహలను తొలగించేందుకు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.


భయం : మధుమేహం ఉంటే తీసుకోవద్దు


వాస్తవం : సాధారణంగా మధుమేహులను గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కన్నా తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. సీతాఫలం కూడా గ్లైసెమిక్ సూచికలో తక్కువ పాయింట్స్ కలిగి ఉంటుంది. స్థానికంగా, కాలానుగుణంగా లభ్యమయ్యే పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేయొచ్చు. మామిడి (51-55), అరటి (51-56) మాదిరిగానే సీతాఫలం జీఐ 54 వరకు ఉంటుంది.


 


భయం – కొవ్వు ఉంటే నివారించండి


 


వాస్తవాలు: ఇందులో విటమిన్ B కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ప్రత్యేకంగా విటమిన్ B6 ఉబ్బరాన్ని(బ్లోటింగ్) తగ్గించడంలో కూడా పనిచేస్తుంది.


 


భయం – హార్ట్ పేషెంట్ అయితే మానుకోండి


 


వాస్తవాలు: మాంగనీస్, విటమిన్ సీ వంటి ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల గుండె సహా రక్త ప్రసరణ వ్యవస్థపై యాంటీ ఏజింగ్ ప్రభావం ఉంటుంది.


 


భయం – మీకు PCOD ఉంటే నివారించండి


 


వాస్తవాలు: ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల అలసట, చిరాకుతో పోరాడుతుంది. అంతేకాదు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.


 


మరిన్ని ప్రయోజనాలు :


 


*అల్సర్లను నయం చేస్తుంది, ఎసిడిటీని నివారిస్తుంది


*స్మూత్ స్కిన్ టోన్ ఇచ్చే మైక్రో న్యూట్రియెంట్స్ ఉంటాయి


*హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది


*యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను ప్రదర్శించే బయోయాక్టివ్ మాలిక్యూల్స్


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM