సీఎస్ సోమేశ్‌ కుమార్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు: కాంగ్రెస్ నేత బక్క జడ్సన్

byసూర్య | Mon, Oct 25, 2021, 07:39 PM

ధరణి పోర్టల్ అంశంలో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ నిర్ణయ లోపాలపై.. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించినట్లు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో సోమవారం బక్క జడ్సన్ విలేకరులతో మాట్లాడుతూ.. సాధ్య అసాధ్యాలను గమనించకుండా ధరణి పోర్టల్‌ను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని ఆరోపించారు.


ఈ మేరకు ధరణి పోర్టల్ ఫెయిల్యూర్ కారణంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి ఆత్మహత్యల వెనుక సీఎస్ సోమేశ్ కుమార్ నిర్ణయ లోపం ఉందని పేర్కొంటూ, సీబీఐతో విచారణ చేయించాలని చేసిన విజ్ఞప్తికి ఎన్‎హెచ్‌ఆర్సీ స్పందించిందని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు నోటీసులు అందినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల ఉపేందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరూరి సాంబయ్య, ఇప్ప శ్రీకాంత్ పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM