హైదరాబాద్ మెట్రో సమయాల్లో మరోసారి మార్పు

byసూర్య | Wed, Jun 09, 2021, 02:45 PM

లాక్‌డౌన్‌కు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ రిలాక్సేషన్ సమయం ఇవ్వడంతో అప్పుడు మెట్రో కూడా అప్పటి రిలాక్సేషన్ సమయానికి అనుగుణంగానే నడిచింది. మలివిడత లాక్‌డౌన్ విధించినప్పుడు రిలాక్సేషన్ సమయం మరో మూడు గంటలు పెరిగింది. ఈ క్రమంలోనే మెట్రో సమయం విషయంలో కూడా మార్పు చేశారు. తాజాగా రేపటి నుంచి రిలాక్సేషన్ సమయాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత పెంచింది. దీని ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రిలాక్సేషన్ సమయం ఉండనుంది. అలాగే ఉద్యోగస్తులు ఇళ్లకు చేరేందుకు మరో గంట అదనంగా సమయం ఇచ్చింది. దీనికి అనుగుణంగానే రేపటి నుంచి మెట్రో సర్వీసుల సమయం పెరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందించనుంది. సాయంత్రం చివరి మెట్రో రైలు 5 గంటలకు బయలుదేరనుంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM