ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో మోసాలు!

byసూర్య | Wed, Apr 14, 2021, 08:23 AM

ట్రేడింగ్‌, మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసిన ఓ వ్యాపారిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  తుర్లపాటి సతీశ్‌ అలియాస్‌ చంద్ర, తుర్లపాటి గాయిత్రి దంపతులు ట్రేడింగ్‌, మార్కెట్‌, ఫార్మాసూటికల్స్‌ అండ్‌ నేచరోసూటికల్స్‌ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాల కోసం యూనిటస్‌ లైఫ్‌ సెన్స్‌స్‌ పేరుతో ఒక సంస్థను కాచిగూడలో ప్రారంభించారు. తాము నిర్వహించే వ్యాపార వ్యవహారాల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలొస్తాయంటూ ఐదు మంది నుంచి రూ.3.35 కోట్లు వసూలు చేసి మోసం చేశారు. అనంతరం హెచ్‌ఎంఏ(హైదరాబాద్‌ మిలియనీర్‌ అలయన్స్‌) నెట్‌ వర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసి మరికొంత మందిని మోసం చేయడంతో ఇతడిపై బహుదుర్‌పురా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మోసాలకు పాల్పడ్డ సతీశ్‌ను సోమవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా.. ఈ కేసులో మరో నిందితురాలైన సతీశ్‌ భార్య గాయిత్రిని ఫిబ్రవరిలోనే అరెస్ట్‌ చేశారు. ఈ కేసును ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు జరుపుతుంది.


Latest News
 

అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం Sun, May 19, 2024, 06:20 PM
పీడీఎస్ బియ్యం పట్టివేత Sun, May 19, 2024, 06:18 PM
మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలి Sun, May 19, 2024, 06:16 PM
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు Sun, May 19, 2024, 06:11 PM
ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM