నోముల భగత్‌ను గెలిపించాలి : ఆర్ కృష్ణయ్య
 

by Suryaa Desk |

 నాగార్జున సాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఇవాళ హాలియాలో బీసీ, ఎంబీసీలకు చెందిన 40 సంఘాలు భగత్‌కు మద్దతుగా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరై ప్రసంగించారు.నోముల నర్సింహయ్య చివరి శ్వాస వరకు ప్రజల కోసం తపించారు అని కృష్ణయ్య తెలిపారు. సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో నోముల వారసుడు భగత్‌కు టికెట్ ఇచ్చారు. భగత్‌ను గెలిపించాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఉందన్నారు. బీసీలు ఐక్యంగా ఉండి ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలలో బీసీలు మరోసారి చరిత్ర సృష్టించాలి. ప్రలోభాలకు గురికాకుండా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా బీసీలంతా భగత్‌కు ఓటేయ్యాలి అని విజ్ఞప్తి చేశారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు. రైతులకు బాసటగా నిలుస్తూ.. వ్యవసాయాన్ని పండుగలా మార్చారు అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ర్ట ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని కృష్ణయ్య పేర్కొన్నారు.


Latest News
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM
మాస్కులు వాడేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి Sat, May 08, 2021, 12:06 PM