దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ పై డేంజరస్ జర్నీ..

byసూర్య | Sat, Oct 10, 2020, 02:45 PM

మీరు హైదరాబాద్ లో ఉంటారా..? చార్మినార్ దగ్గరో, ట్యాంక్ బండ్ పైనో.. సెల్ఫీ దిగినా దిగకపోయినా ఎవరూ పట్టించుకోరు, కానీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మాత్రం సెల్ఫీ కచ్చితంగా దిగాల్సిందే. దిగిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాల్సిందే. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కి ఇప్పుడు అంత క్రేజ్ ఉంది మరి. బ్రిడ్జ్ పై సెల్ఫీ దిగడం, వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం అదో పెద్ద క్రెడిట్ గా మారింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్.. హైదరాబాద్ కు ఐకానిక్ బ్రిడ్జ్ గా ఉంటుందని ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రారంభించింది. అయితే కేసీఆర్ సర్కార్ అనుకున్నది ఒకటి, అక్కడ అయినది మరొకకటి. వాహనాలకోసం కట్టిన ఈ బ్రిడ్జ్.. సెల్ఫీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఏకంగా న్యూడ్ సెల్ఫీలు దిగేందుకు సైతం యువకులు సాహసం చేస్తున్నారంటే.. దుర్గం చెరువు బ్రిడ్జ్ కి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 


 


సెప్టెంబర్ 25న తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభమైంది. లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యాటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. సాయం సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. వాహనాల రాకపోకలను సైతం పట్టించుకోకుండా మహిళలు సైతం రోడ్డు మధ్యలోకి వెళ్లి సెల్ఫీలు దిగడం మరీ విచిత్రం. 


 


వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున ఈ  వంతెనపైనుంచి వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెనపై వాహనాలు వేగంగా వేళ్తున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ఫోటోలకు ఎగబడుతున్నారు. మరీ ముఖ్యంగా శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తుండటంతో సెల్పీస్పాట్ ప్రమాదకరంగా మారింది. పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవడంలేదు. వాహనాలు వస్తున్నా కూడా లెక్కచేయకుండా రోడ్డు దాటేస్తున్నారు. ఈ న్యూసెన్స్ ఎక్కువయ్యే సరికి సైబరాబాద్ పోలీసులు శని, ఆదివారాల్లో వాహనాలను కేబుల్ బ్రిడ్జ్ పైకి అనుమతించకూడదని నిర్ణయించారు. వీకెండ్స్లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.


 


దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాను రాను పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బ్రిడ్జిపై ఆగి సెల్ఫీలు దిగితే కేసులు పెడతామని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. దుర్గం చెరువు బ్రిడ్జిపై అర్థరాత్రి దుస్తులు విప్పేసి సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. లైవ్లో పోకిరీల ఆగడాలను చూసిన పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసు స్టేషన్కి తరలించారు. ఇకపై ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెల్ఫీలు దిగుతున్న వారందరి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారికి కనువిప్పు కలిగేలా చేస్తున్నారు పోలీసులు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM