బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్

byసూర్య | Sun, Apr 05, 2020, 10:45 AM

బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధర పరుగులు పెడుతూనే ఉంది. ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో మన దేశంలోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.720 పెరుగుదలతో రూ.41,900కు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.730 పెరుగుదలతో రూ.44,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.110 పెరుగుదలతో రూ.40,270కు చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.230 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.39,730 నుంచి రూ.39,960కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.710 పెరుగుదలతో రూ.43,270 నుంచి రూ.43,980కు చేరింది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.110 పెరిగింది. దీంతో వెండి ధర రూ.40,270కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM