పెట్రోల్, డీజిల్‌ ధరలు ఇలా..

byసూర్య | Thu, Apr 02, 2020, 10:43 AM

దేశీ ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో గురువారం లీటరు పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పైకి కదిలాయి.


అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.74.61 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్దనే నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.21 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.68.15 వద్దనే నిలకడగా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.69.59 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.62.29 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.75.30 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.65.21 వద్ద నిలకడగా కొనసాగుతోంది.


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 5.82 శాతం పెరుగుదలతో 26.16 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 4.73 శాతం పెరుగుదలతో 21.27 డాలర్లకు ఎగసింది.ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM