కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు : లక్ష్మణ్

byసూర్య | Sun, Oct 13, 2019, 06:08 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ తెలంగాణాలో ప్రజా స్వామ్యాన్ని పాతర వేసి కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఒక పక్క విద్యార్దుల జీవితాలను కూడా నాశ నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. న్యాయమైన డిమాండ్‌ల కోసం కార్మికులు చేస్తున్న సమ్మెను కూడా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. విద్యార్ధులు సమ్మెలో భాగస్వాములవుతారనే భయంతోనే దసరా సెలవులు పొడిగించారని అన్నారు. ఆనాడు కిరణ్‌కుమార్‌రెడ్డి అవలంభించిన విధానాలనే కేసీఆర్‌ అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు పండగ ముందు జీతం ఇవ్వలేదు. కష్టం చేసిన దానికి జీతం ఇవ్వకపోతే ఎలా?అంటూ ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ బలోపేతానికి ఒక్క చర్య అయినా చేపట్టారా? ఆరేళ్లలో ఒక్క ఆర్టీసీ ఉద్యోగాన్నిఅయినా భర్తీచేశారా? అంటూ లక్ష్మణ్‌ ప్రశ్నించారు


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM